PLS FALLOW MY TOP ONE TELUGU SITE.మీరు టాప్ వన్ తెలుగు సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదములు మరిన్ని మంచి పోస్ట్ ల కోసం ఫాలో బటన్ నొక్కండి... VENKAT .

 

మన సైనికుని పేరు చెపితే చైనా సైనికుల ప్యాంట్లు తడుస్తాయట.

చాలా ఉత్సుకత కలిగించే అంశం,
మనిషి చనిపోయిన తర్వాత డ్యూటీ చేయడం
సాధ్యపడుతుందా !!!?

   


ఇప్పటికీ జీతం, సెలవులు, ప్రమోషన్‌ ప్రభుత్వం ఇస్తుంది మరి....
ఇది నమ్మలేని నిజం.....

 

సైన్యంలో పనిచేసే ప్రతి సైనికుడు దేశ రక్షణకై తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తాడు. తన ప్రాణాలను పణంగా పెడతాడు, కాని ఈ జవాను తన తుది శ్వాస విడిచే వరకు కాదు తన మరణానంతరం కూడా విధులు నిర్వహిస్తున్నాడు.

 చనిపోయిన తర్వాత డ్యూటీ

ఏవండోయ్‌ ఇది మన నమ్మకం కాదు మెదట చైనా వారే నమ్మారు. మన సైనికులు మొదట నమ్మితే భారతీయులు మూఢభక్తులనో, మూఢనమ్మకాలనో చేతకానివారనో కొట్టి పారేసేవారు మొదట చైనా వారే ఓ సైనికుడు తెల్ల డ్రెస్సులో రాత్రి పూట గుఱ్ఱం పై సరిహద్దు దాటి వస్తున్నాడని మన సైనికులతో అతన్ని వెంటనే వెనక్కు పిలవండని గగ్గోలు పెడతారట !!! అతను చనిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయి విధులు నిర్వహిస్తున్నాడు. ఏ విశ్వాసమో కల్పనో కాదు భారత సైనిక అధికారులుఅన్ని ఋజువులు చూసుకుని నిర్దారించుకున్నారట. అతనే మన సైనికులు కొలిచే ఆరాధ్య దైవం హరిబజన్‌ సింగ్‌.

 

హరిభజన్‌ సింగ్‌ 1941 లో పాకిస్తాన్‌ లోని పంజాబ్‌లో జన్మించారు. 1956 లో ఆర్మిలో చేరారు. చాలా సందర్భాలలో యుద్దం చేసారు. భారత్‌ చైనా యుద్ధంలో ఆయన చనిపోయారు. ఆయన మృతందేహం కూడా దొరకలేదు.

 


హరిభజన్‌ సింగ్‌ చనిపోయిన తర్వాత ఒక సైనికునికి కలలో కనిపించి తన మృదేహం ఎక్కడ ఉందో చెప్పాడట. కాని దానిని ఆర్మీ అధికారులు కొట్టి పారేసారు. మరోసారి ఓసైనిక అధికారికి కూడా కనిపించి ఇదే విషయాన్ని కలలో చెప్పారట ఈసారి ఆ అధికారి చెప్పిన చోట వెదకగా మృతదేహం లభించింది.పూర్తి సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరిపించారట.
మరో సారి కలలో కన్పించి తన మరణం శరీరానికే కాని ఆత్మ కు కాదని తాను ఎప్పటికి విధులలోనే ఉంటానని తెలిపాడట.అయితే ఈ విషయాన్ని కూడా ఆర్మీ అంతగా పట్టించూకోలేదు, కాని శత్రు దేశం సైనికుల కదలికు,పన్నాగాలను, ప్రమాదం సంభవించే తరుణంలో హరిభజన్‌ సైనికులకు కలలో కనిపించి హెచ్చరిస్తారట, ఇది మన ఆర్మీ పూర్తిగా హరిభజన్‌ సింగ్‌ ను నమ్మిన తర్వాత అతనికి1969 లో మహా వీరచక్ర పురస్కారంతో సత్కరించింది.ఆయన చేసిన, చేస్తున్న సేవలను స్మరించుకోవటానికి సిక్కిం చైనా నాధుల ప్రాంతంలో సైన్యం అంతా కలిసి ఆయనకు హీరో ఆఫ్‌ నాధుల అనే పేరుతో ఆలయంనిర్మించారు. చైనాను హరిభజన్‌ దెయ్యమై చుక్కలు చూపిస్తూ వేదిస్తుంటే భారత దేశానికి, సైన్యానికి దేవుడిలా మారి హరి భజన్‌ బాబాగా పిలవబడుతున్నాడు,సైన్యం ఆ ప్రాతం ప్రజలు భక్తి విశ్వాసాలతో ఆయనకు పూజలు చేస్తారు. ఇది అక్కడి ప్రజలకు ప్రముఖ పున్యక్షేత్రంగా మారింది.

 

ఆయన ఆలయంలో ఒక సమాధి ఉంటుంది,
రోజూ మిగతా సైనికులకు కల్పించే భోజన వసతిని కల్పిస్తారు. సాయంత్రం ఆయన డ్యూటీ పై వెల్తాడు కాబట్టి రాత్రి వేలల్లో ఆలయాన్ని మూసి ఉంచుతారు. భక్తులు తమకోరికలని అక్కడున్న పుస్తకంలో రాస్తారట ఆయన డ్యూటీనుండి తిరిగి వచ్చి భక్తుల కోరకలను చదువుతారని వారినమ్మకం. అదేవిధంగా ఆర్మీ నిర్వహించే అన్నిఅధికారిక సమావేశాలలో ఆయనకు ఒక కుర్చీ వేస్తారట సమావేశ హాజరులో ఆయన పేరు తప్పకుండా రాస్తారట.

 

ప్రతి సంవత్సరం ఆయనకు వర్తించే సెలవులకు ముందుగా రైలు టికెట్‌ బుక్‌ చేసి ఇద్దరు జవానులు తోడుగా పంజాబ్‌ లోని ఆయన స్వస్థలానికి తీసుకొని వెల్తుంటారట. ఇప్పటికి ఆ రైలు వారి స్వంత గ్రామం చేరుకోగానే పెద్దసంఖ్యలో ఆప్రాంత వాసులు ఘన స్వాగతం పలికి ఆహ్వానిస్తారట.

 

భారత దేశం మనం గర్వించ దగ్గ పుణ్య భూమి,
ఈ నమ్మలేని నిజం ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ !!
చైనా సైనికులు బెంబేలెత్తే తీరుగ మన సైనికుని ఆత్మ డ్యూటీ చేయడం గురించి అందరికి తెలియడానికి వీడియో డాక్యు మెంటరీ నుండి సేకరించి ఇది నాచే వ్రాయబడింది.
నచ్చితే శేర్‌ చేయండి నచ్చకపోతే లైక్‌ కొట్టండి మరిచిపోకండి మిత్రులారా..