How Lightning Forms | How to protect from Lightning | Telugu Badi
పిడుగు పాటు Lightning
ఎక్కవగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనుల నిమిత్తంపంటలను విత్తడానికి రైతులు తడి పొలాల్లో పని చేసే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మరణించారు బహిరంగ ప్రదేశాలలో పనులు చేస్తున్న సమయంలో ఉరుములతో వర్షం కారణంగా పిడుగు పాటు సంభవించవచ్చు.
దేశంలో పిడుగుపాటు కారణంగా ఏటా 2,500 మరణిస్తున్నారు.
పిడుగుపాటు సంభవించడాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలరా? అలా అయితే, ఎలా?
మెరుపులు ఉరుముల వర్షాన్ని బట్టి మనం పిడుగులు పడవచ్చనే అనుకుంటాం.
కాని కచ్చితంగా గుర్తించడం మనిషి మెదడుకు వీలుకాని అంశం.
టెక్నాలజీతో ె గుర్తించడం సాధ్యమవుతుందా ?
మెరీ ల్యాండం చెందిన కంపనీ పిడుగుల ప్రమాదాలను తగ్గించేందుకు భారతీయ అతరిక్ష పరిశోధనా సంస్థ తో కలిసి కొన్ని రాష్ట్రాల విపత్తు నివారణ సంస్థలతో కలిసి వాతావరణ పిడుగు పాటు హెచ్చరికలను పంపించే ఏర్పటు చేసింది. ఈ సంస్థ ప్రపంచవాప్త ఎన్నిక చేయబడిన విపత్తు నివారణ సంస్తలకు హెచ్చరికలు జారీ చేస్తుందు.
ఇది తమకున్న ఎర్త్ నెట్ వర్క్ ద్వారా సెన్సార్ ద్వారా పిడుగుపాటు సమయంలో విడుదలయ్యే
రేడియో ఫ్రీక్వెన్సీలను కొలుస్తుంది.
ఇది పిడుగు పాటు కుసంభందించి విద్యత్తాయస్కాంత కార్యాచరణ ను మరియు రాకను జిపియస్
వంటి సమయాన్ని కూడా నిర్ధారించుకొని స్థానిక విపత్తు నివారణ సంస్థలకు చేరవేస్తుంది.
మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ సహకారంతో కుప్పం
ఇంజనీరింగ్ విధ్యార్థులు అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ద్వారా పిడుగుపాడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పిడుగు పాటుకు ముందు 25-30 ని. ముందు హెచ్చరికలు జారీ అవుతాయి.
దీనివల్ల అక్కడ వున్న ప్రజలు సురక్షిత ప్రాంతానికి వెల్లే వెసులు బాటుకు వీలవుతుంది.
ఇది గ్రామీణ వ్యవసాయ దారులకు ఎంతో మేలు చేస్తోంది.
మన తెలంగాణలో ఇదివరకే ఈ టెక్నాలజీ వచ్చి వుంటే మీకు తెలిసిన పిడుగు పాటు మరణాల వార్తలు మీరు వినిఉండేవారు కాదు.
ఇప్పటికైనా ఈ అధునాతన సాంకేతకత మన రాష్ట్రానికి రావాలని వ్యవసాయ దారులకు మేలు జరగాలని కోరుకొందాం. !!! @ venkat.
0 Comments