క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి 


Cloudburst

attacked in telangana ???

వరునాస్త్ర ప్రయోగం జరిగిందా ???!!!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి తీరంవెంబటి వరదలు భీబత్సవం సృష్టంచాయి. కుంబ వృష్టి వలన అనేక గ్రామాలు నీట మునిగి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది.

విదేశీ కుట్ర జరిగిందా ?!!!

క్లౌడ్ బరస్ట్ అనే టెక్నాలజీ ద్వారా విదేశీయులు గోదావరి పరవాహక ప్రాంతం పై ఈ చర్యలకు పాల్పడ వచ్చని కొందరు భావించడం మనకు తెలిసిందే.

భారతీయ పురాతన విజ్ఞానాన్ని విదేశీయులు దొంగిలించి ఈ దురాగతాలకు ప్రయోగాలకు పాల్పడుతున్నారా ???




మహా భారతంలో ఉపయోగించబడిన ఆచరణకి కష్ట సాధ్యమైన నాగాస్త్రం,దీనినే వశీకరణ అస్త్రంగా పిలుస్తారు ఆగ్నేయాస్త్రం , కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది , పాశుపతాస్త్రం ఇది మహాదేవుడికి సంబంధించినది . వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవుడికి సంబంధించినది . వారుణాస్త్రం ఇది వరణుడికి సంబంధించినది కుంభవృష్టి కురిపించగలదు. ఇలా ఎన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదంలో భాగాలే .. అంటే ఇక్కడ మనం తెలుసుకోవల్సినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలు . రాక్షస పీడను , శత్రు పీడను , నిర్మూలించడం కోసం రూపొందించిన విద్యలు .. ద్వాపరయుగంలో , త్రేతాయుగంలో కూడా రాక్షస ఫీడను నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు .

ఇందులో మర్మం ఏమిటి అంటే పైశాచిక తనాన్ని నిర్మూలించడమే !! కొంత శ్రద్ధగా గమనిస్తే ఇందులో మర్మం అర్థం అవుతుంది. ఎదుటి వారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు , శాపాలు అధికంగా ఉంటేనే అవి వారి పై ప్రభావాన్ని చూపుతుంది . అంటే చేసే ప్రతీ క్రియ కూడా కర్మ ఫలమే .. అది మంచి కానీ చెడు కానీ , పైశాచిక గ్రహాల చెడు ప్రభావాలను నిర్మూలించడానికి మాత్రమే తంత్ర విద్య ఉపయోగపడతాయి .. మన నుదిటి వ్రాత ఆ బ్రహ్మ ఆజ్ఞానుసారం జరుగుతుంది . మనిషి ఎదుర్కొనే భాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం ఈ తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా మనకు ప్రసాదించారు . ఇందులో అంతర్యం ఏమిటి అంటే , వర్షం వచ్చినప్పుడు గొడుగును ఉపయోగించడం వలన ఆ వర్షం నుంచి తడవకుండా ఉండగలుగుతాం .. వర్షం పడటం బ్రహ్మ మనపై చూపించే నుదిటి వ్రాత .. మండుటెండ కాచినపుడు పాదరక్షలు దరించడం ఆ వేడి తాపం నుంచి కాళ్ళు కాలకుండా రక్షించుకోవడం . వేడి తాపం అనేది సూర్య గ్రహ రూపంలో బ్రహ్మ మనపై చూపుతున్న వ్రాత .. వర్షం నుంచి , సూర్య తాపం నుంచి కాపాడే గొడుగు , పాదరక్షలు గ్రహ దోష నివారణా మార్గాలు లాంటివి .. విధిని తప్పించుకోవడం కష్టం కానీ , తామస , రజో , లక్షణాలు కలిగిన శత్రు ఫీడ నివారణా , అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు ..!! ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంత వరకు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి. అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేఘమదనం కార్యక్రమం నిర్వహించి వర్షాలను కురిపించాలని ప్రయత్నం జరిగింది. ఇది సరైన ఫలితాలను ఇవ్వకపోడంతో ఇది ముందుకు సాగలేదు. ప్రపంచ వ్యప్తంగా ఇలాంటి ప్రయోగాలు జరిగి వుండొచ్చు అన్నది మేధావుల ఆలోచన.

విజయవంతం అయిన దేశాలు ఈ ప్రయోగాలు చేపట్టవచ్చు ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతంపై ఈ ప్రయోగాలు జరిగాయన్నది కొందరి అనుమానం.

సేకరణ