రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore )

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) (మే 7, 1861 - ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.



Rabindranath Tagore Jayanti


రవీంద్ర నాథ్ ఠాగూర్
భారతీయ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన విశ్వకవి
జయంతి నేడు...
ఠాగూర్ ర‌చించిన గీతాంజ‌లిలో కొన్ని మీకోసం
ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో, ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో, తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు"
అంజలి :
మానవ జీవన భావనల, మానవ జీవిత భావుకతలకు సుమాంజలి గీతాంజలి. మానవ మేధా మహనీయతకు కలకాలపు నివాళి గితాంజలి. కమనీయమయిన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే మంజుల కవితా మంజరి గీతాంజలి. జిలుగులతో గిలిగింతలు పెట్టి వెలుగుబాటలు తీర్చే రత్నదీపావళి గీతాంజలి.
చిన్నారిపూవు, సెలయేటి గలగల, పసిపాప బోసి నవ్వు, గాన మధుర మధుపాత్ర గీతాంజలి. మానవుని అంతరాంతాలలో వింగడింపరాని వేదనా వేదనల కలయిక గీతాంజలి. ఉన్నాడో లేడో తెలియక ,కనిపించీ కనిపించక దోబూచులాడే విశ్వాత్ముని విశ్వలీలల విలసనం గీతాంజలి. మానవత, విశ్వమానవత కళ్యాణం, విశ్వకళ్యాణం, సాధన సాధనాలు వీని ఈ సావాస్యం గీతాంజలి.
గీతాంజలి కావ్యాలు
నీవు నన్ను పాట పాడమని ఆజ్ఞాపించావు.
అప్పుడు నా హృదయం ఎంత పొంగి పోయిందనుకున్నావు? నన్ను కదా నీవు పాట పాడమని అడిగావనే గర్వంతో నా హృదయం పగిలిపోయిందేమోనని అనిపించింది. అప్పుడు నీ ముఖం వైపు చూశాను. నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.
నా బ్రతుకులోని అపస్వరాలన్నీ కరిగి ఒక కమ్మని మధుశ్రుతిలో లీనమైనాయి. నాలోని పూజాభావం హాయిగా ఏ చింతా లేకుండా సాగరంపై ఎగురుతూ వెళ్ళే పక్షిలాగా రెక్కలు చాచింది.
నాకు తెలుసు. నీకు నా పాటంటే ఇష్టమని, గాయకుడు గానే నీ సాన్నిధ్యంలో నిల్చున్నానన్న విషయం కూడా నాకు తెలుసు.
నా పాట ఒక పక్షిలా రెక్కలు చాచితే, ఆ పంచక్షాలలో మాత్రమే నీ పాదాలు స్పృశిస్తాను.
కాని నీ పాదాలను మాత్రం నేను ఎన్నటికీ అందుకోలేను. గానామృతాన్ని తాగిన మత్తులోనన్ను నేను మరచిపోతాను. అప్పుడు నీవు నాకు ప్రభువన్న విషయం కూడా మరచి, మిత్రుడా! అని నిన్ను సంబోధిస్తాను.
నేను పాడే పాటకు ఆభరణాలు లేవు. అందచందాలు లేవు. సొమ్ములూ, శోభలూ విసర్జించింది నా పాట. అందంగా, ఆకర్షణీయంగా అలంకరించుకున్నానన్న అహం లేదునా పాటకు. ఆభరణాలూ, అలంకారాలు ముసరి లీనతకు అడ్డు వస్తాయి. నీవు నన్ను కౌగలించుకుని ఏవేవో గుసగుసలు వినిపిస్తూ వుంటే ఆభరణాల గలగలలో నీ గుసగుసలు వినిపించవు. నేనొక కవినన్న గర్వం నీ సాన్నిధ్యంలో అంతరించి పోతుంది.
ఓ మహాకవీ! నేను నీ పాదాల వద్ద కూర్చున్నాను. నా జీవితాన్ని ఒక చిన్న వేణువులాగ సుగమనం, సుందరం చేసుకోనీ - చాలు. నీవు వేణువును ఊదుదువుగాని.
నీవునీ సేవకుని మృత్యువునునా వద్దకు పంపావు.
అతడుఅజ్ఞాత సముద్రంలోప్రయాణం చేసినీ సందేశాన్ని తీసుకొనినా యింటికి వచ్చాడు.
రాత్రిచీకటి. నా హృదయంలోయేదో భయం.అయినా నేను దీపం తీసుకునివాకిటివరకు వెళ్ళి,తలుపు తెరచిఅతన్ని లోనికి ఆహ్వానిస్తాను.నా వాకిట నిల్చివున్నదినీవు పంపిన దూతయేకదా!
ముకుళితహస్తాలతో, కన్నీటికాన్కలతో అతన్నిపూజిస్తాను.
నాహృదయ సర్వస్వాన్నిఅతని పాదాలవద్దవుంచుతాను.
అతడుతను వచ్చినపని ముగించుకుని తిరిగివెళతాడు- ఉదయంలోఒక నల్లని నీడనువిడిచి.
నానిర్జన గృహంలోనా పరిపక్వ అంతరాత్మ ఒకటేనీ కోసం కాన్కగా తెల్లవారిలేచి చూసేసరికి,నా పూలతోట నిండా అద్భుతమైనపుష్పాలు పూచి ఉండటంచూచాను.
మృత్యుదేవతనీ తలుపు తట్టినప్పుడునీవు ఏమి సమర్పిస్తావు?
నాఅతిధి ముందునేనూ, నా పరిపూర్ణ జీవనపాత్రికను ఉంచుతాను.వట్టి చేతులతోఅతన్ని వెళ్ళనివ్వనునేను.
వసంత,శరద్రాత్రులు, నేనుకన్న తీయని కలలన్నీఅతనికి సమర్పిస్తాను.నా జీవన సంపాదనంతాఅతని మ్రోల ఉంచుతాను.
చరమదినమున మృత్యువతిధివైవచ్చి, నా తలుపుతట్టినా వెరగొందను.
మరణమా!నా జీవన చరమసాఫల్యమూర్తీ! ఏదీ,నా వద్దకు వచ్చినాకు నీ రహస్యం చెప్పు.నీ కోసమే రోజురోజునిరీక్షించాను. నీ కోసమే జీవనసుఖదు:ఖాలు భరించాను.
నాకలలు, నా ఆశలు, నాఆశయాలు, నా ప్రేమలు,నా సర్వస్వం రహస్యంగానీకు అభిముఖంగానేప్రవహించాయి.
ఒక్కసారినా వంక నీ చూపు ప్రసరించు.అంతే చాలు. నా బ్రతుకంతానీకు వశమైపోతుంది.
వరునిమెడలో అలంకరించడానికికూర్చిన పూలమాలసిద్ధంగా వుంది. వివాహంకాగానే వధువు తనగృహాన్ని విడిచి,తన ప్రభువునుఒంటరిగా ఏకాంత రాత్రిలోకలుసుకుంటుంది.
ఎన్నో అద్భుత కావ్యాలను రవీంద్ర నాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో రచించారు. రవీంద్రుడి కవిత సుమాంజలి గీతాంజలి. ఇది యిప్పటికి ఎప్పటికి ఓ మహా అద్భుత కావ్యం చరిత్రలో నిలిచిపోతుంది. (కంటెంట్ సేకరించబడినది venkat)

Rabindranath Tagore Jayanti or the Rabindra Jayanti is a cultural celebration for the Bengali community around the world, in remembrance and reverence of the luminary Rabindranath Tagore on his birthday. It is celebrated annually and globally in May, specifically on the 25th day of the Bengali month of Boishakh. Tagore was born on the day in the year 1268 — as per the Bengali calendar — or 1861 AD, as per the Gregorian calendar. This year, it will be celebrated on May 7, which is a Thursday.

He was born to Debendranath Tagore and Sarada Devi, and was nicknamed ‘Rabi’. The polymath was also known by his sobriquets ‘Gurudev’, ‘Kabiguru’, and ‘Biswakabi’.

As mentioned before, the day is significant for Bengalis everywhere. Cultural programmes and events are held on the day, including discussing the life and works of Tagore, singing Rabindra sangeet — or songs written and composed by him — dances, drama, writing, poetry recitation, etc. Schools, colleges and universities in West Bengal and around the world also pay their homage to the Nobel prize awardee. The day is elaborately celebrated at Santiniketan in Birbhum in West Bengal, mainly in the Visva-Bharati University which was established by him.

   janagana mana  click here 


                                                                                                                                        venkat ......
2 Shares
Like
Comment
Share

Comments