శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు,  అన్నమయ్య

జీవించిన కాలం : మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503 వరకు

జననము ః

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక అనే గ్రామంలో ప్రఖ్యాత వైష్ణవ సంప్రదాయ కుటుంబానికి చెందిన సాహిత్య సంగీత విద్వాంసుల వంశస్తులయిన నారాయణసూరి లక్కమాంబ దంపతులకు సర్వధారి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు అంటే మే 9, 1408 లో తాళ్ళపాక అన్నమాచార్యుడు జన్మించాడు. వీరే అన్నమయ్య గా సుప్రసిద్ధులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి గొప్ప కవి, సకల విద్యా దురంధరుడు.పండితుడు. తల్లి లక్కమాంబ సంగీత కళానిధి. మహా భక్తురాలు. మధురంగా పాడేవారట. 

అన్నమయ్య కు యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే పడతులతో వివాహం అయ్యింది.

తొలి వాగ్గేయకారుడు 


             తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య నే. పద కవితా పితా మహుడు బిరుదాంకితుడు. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పద కవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని అహోబిలం లోని నరసింహ స్వామిని ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు,సంగీతం,శృంగార, బావ లాలిత్యం పెనవేసుకొని ఉంటాయి. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న. అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. రచయితగా యోగిగా,స్వరకర్తగా,కవిగా, పదకవితా పితామహుడిగా, వాగ్గేయకారుడు గా ప్రసిద్ధులు. అన్నమయ్య భార్య తిమ్మక్క.తెలుగు లో తొలి కవయిత్రి.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు 1503 ఫిబ్రవరి 23న పరమాత్మలో ఐక్యమయ్యారు.


నేటికీ అన్నమయ్య కీర్తనలు  ఎక్కువ ప్రజాదరణ లో ఉన్నవి సంగీత సాహిత్య ప్రియులకు  అన్నమయ్య ఆదర్శం...

సేకరణ   ః  సోర్స్ ఇంటర్నెట్.....