ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత


సాధారణంగా..,జీవితంలో ఎదురయ్యే ప్రతీ ప్రతికూల పరిస్థితి మనస్సును బలహీనం చేస్తుంది. కానీ ఆధ్యాత్మికత అలవడిన మనస్సుని మరింత శక్తిశాలీగా చేస్తుంది. కారణం ఏమిటంటే ఆధ్యాత్మికత ఉన్న చోట అహం ఉండదు కనుక.
సూక్ష్మంగా ఆలోచిస్తే మన మనస్సుని బలహీన పరిచేది పరిస్థితి కాదు, ఆ పరిస్థితికై మనం చేసే ఆలోచన. ఆ ఆలోచన అహంచే ప్రభావితమై ఉంటే బలహీన సంకల్పం, ఆధ్యాత్మికతతో ప్రభావితమై ఉంటే శక్తిశాలీ సంకల్పం అవుతుంది..!

ఆధ్యాత్మికతను ఆశ్రయించుటకు వయోపరిమితి అవసరమే లేదు, జీవితాన్ని ప్రారంభిస్తూనే అలవరచుకొనుట ముఖ్యము..జీవన ముగింపు దశ అయిన వృద్ధాప్యంలో ఆశ్రయించుటవలన పెద్దగా సాధించేందుకు ఏమీ ఉండదు...