మనకు తెలియకుండా మనం ఇప్పటికీ ఆచరిస్తున్న ఓ విధానం .....

మనకు తెలియకుండా మనం ఇప్పటికీ ఆచరిస్తున్న ఓ విధానం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం .....

నిన్న మొన్నటివరకు మనం పెండ్లిండ్ల లో రాయించిన కట్నాలగురించి.

అవును నిజమే కదా 116, 216,316, లేదా 516  ఇంకా స్ధోమతను బట్టి 1016 ఇంకా,ఇంకాాాా....

అవును ఆ పదాహారు సంగతేంటి అసలు

మన పక్కనున్నమిత్రులో లేదా బంధువులో  అలానే రాయించి ఉండొచ్చు

లేదా మీరు కానుకగా లేదా దక్షిణ గా ఇచ్చేది  16 కలిపి ఇవ్వాలని స్వయం విజ్ఞానులో స్వయం ప్రకటిత స్వాములు తెలిపి ఉండవచ్చు


కానీ అసలు నిజం ఏంటంటే నిజాం కాలంలో  అనేక సంస్ధానాలు ఉండేవి వాటిలో హిందు సంస్దానాలు కూడా ఎక్కువగా ఉండేవి వాటిలో గద్వాల సంస్ధానాధీశుడు వనపర్తి సంస్ధానాధీశులు ఎక్కువగా పండితులను బాగా ఫోషించేవారు, ఆదరించేవారు. వీరి వద్దకు గోదావరి జిల్లాల నుండి పండితులు తిరుపతి వెంకట కవులు లాంటి వారు మరియు ఇతర పండితులు వచ్చేవారు.


వీరికి సంస్ధానాధీశులు కానుకగా 100 రూపాయలు ఇచ్చేవారు. అవి నిజాం నాణేలు అప్పుడు విజయనగర ప్రాతం ఇంగ్లీషు వారి పరిపాలనలో ఉందేది. అక్కడ కరెన్సీ చెలామణిలో ఉండేది.

పండితులు నిజాం నాణేలను గోదావరి జిల్లాలలో కరెన్సీగా మార్చుకున్నపుడు 94 రూపాయలు మాత్రమే వచ్చేవి.

పండితులు ఎంట్రా 100 రూపాయలకు ఇక్కడ 94 వస్తున్నాయి 100 వస్తే బాగుండేది అని మదనపడేవారట, ఈ సమాచారం కాస్త సంస్ధానాదీషుల నుండి నిజాం నవాబుగారికి చేరిందట.

అప్పుడు నిజాం నవాబు పండితులు బాధపడడం ఎందుకయ్యా ఎంత  ఇస్తే వారికి 100 రూపాయలు వస్తాయని తమ కోశాధికారిని అడగగా .

జీ హుజూర్ వారికి అక్కడ 100 రూపాయలు రావాలంటే మనం 16 రూపాయలు కలిపి ఇవ్వవలసి ఉంటుందని సెలవిచ్చాడట.

అప్పటినుండి ఈ 116 కధ మెదలయ్యింది.

ఇప్పుడు మనం నిజాం నీడనే తెలియకుండా  అనుసరిస్తూ ......

116, 216, 316, 516, 1016 ఎంటో  ఈ కొసరు....

ఇంకా సున్నా రాకూడదని చెప్పుకోవడం చూస్తుంటా

సున్నా అనేది పూర్ణం ను సూచిస్తుంది .

అదిలేకుండా లెక్కలు కుదరనే కుదరదు.

మళ్లీ పెండ్లిల్ల సీజన్ లో గుర్తుంచుకోండి ఎంతైనా రాయించవచ్చు చిల్లర కోసం వెదికే అవసరం కూడా వుండదు.

కాబట్టి మనం మనస్పూర్తిగా ఇచ్చే కానుకలు, కట్నాలు ఎంతైన  ఇవ్వచ్చు

నువ్విచ్చే కానుక  ఎంత చిన్నదైనా గ్రహీత నీఅభిమానాన్ని నీ రాకను చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు కానీ ఈ పదహారును చూసి కాదని గ్రహిద్దాం.


సమాచారం సేకరించబడింది

వ్రాసింది మాత్రం నేను వెంకట్........................