చేప మందు 


మృగశిర కార్తీకం (మృగశిర కార్తే) మృగశిర నక్షత్రం ద్వారా సూర్యుని ప్రవేశం మరియు సంచారాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం 7 లేదా 8వ తేదీలలో వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, మృగశిర కార్తె వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం, అనగా. 2022, మృగశిర కార్తి జూన్ 08, బుధవారం వస్తుంది.


మృగశిర కార్తీక నాడు చేపలు తింటే శ్వాసకోశ రుగ్మతలు నయమవుతాయని లేదా ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు.భారతదేశంలోని హైదరాబాద్‌లో, మృగశిర కార్తీ 'చేప ప్రసాదం హైదరాబాద్ లో అందిస్తారు, ఆస్తమా మరియు శ్వాస సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు 5 తరాలనుండి బత్తిని గౌడ్ కుటుంబం అందించే ఉచిత సేవ, మూలికా ఔషధంతో నింపబడిన జీవించి ఉన్న చేపలను అందించే కార్యక్రమం. ఇది పూర్తిగా నమ్మకంతో రోగులు స్వీకరిస్తారు.

న్యాయస్థానాల్లో సవాలు

ఆస్తమాను నయం చేసేందుకు "చేప ఔషధం" అందించే 160  పై ఏళ్ల సాంప్రదాయ ఔషధం భారతీయ న్యాయస్థానాల్లో సవాలు చేయబడింది. డ్రగ్స్ అండ్ మాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954లోని నిబంధనలను అమలు చేస్తూ, ఔషధంలోని పదార్థాలకు సంబంధించిన రహస్యాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశ్నించింది.

 హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లోని రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. విగ్ ఈ మందు పనిచేస్తుందని ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవని  అప్పట్లో కోర్టుకు తెలిపారు.

 మరియు ఆధారాల కోసం ఎటువంటి సమాచారం రికార్డు చేయబడలేదని డాక్టర్ మరియు బత్తిని గౌడ్ కుటుంబం కూడా తెలిపింది.


ఈ మందు మంచో కాదో  తెలీదు కాని ఒకే చోట వేలాది మంది చేరడం చేతులకు గ్లౌసులు లేకుండా మందు పంపిణీ చేయడం వలన అంటువ్యాధులు మాత్రం తప్పక వస్తాయన్నది నిపుణుల వాదన.

మందుకోసం అమ్ముడైన చేపలు వేలల్లో ఉంటే, లక్షల్లో జనాలు వచ్చినట్లు చెప్పే విధానం కూడా  కొంత విస్మయానికి గురిచేసే అంశం. 

మందు మందులాగా ఎక్కడైనా ఎవరిచ్చినా పనిచేయాలి,

రోగికి ఔషదం అందించే వారు క్వాలిఫైడ్ వైద్యుడై ఉండాలి.

రోగి స్వస్తత పొందాలి,


అందుకే చేప మందు  చేప  ప్రసాదంగా మారిందని గుర్తించాలి.

నమ్మకమనో హస్తవాసి అనో అనుకోవడం పెద్దపొరపాటు, లేదా లేని సమస్యలు రావచ్చు

హేతుబద్దంగా ఆలోచించండం అస్సలు తప్పుకాదని నేననుకుంటా జర జాగ్రత్త ....     వెంకట్