World Environment Day 2022: #OnlyOneEarth

మన ఏకైక నిజమైన నివాసమైన భూమిని పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి  ప్రచారం చేయడానికి జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.


2022 #OnlyOneEarth యొక్క థీమ్ భూమి యొక్క పౌరులుగా మన పాత్రపై దృష్టి పెట్టడానకి, పర్యావరణాన్ని రక్షించడం మరియు ప్రతిచోటా మరియు ప్రతిరోజు స్థిరమైన స్వచ్చమైన జీవనాన్నిగడపడానికి  ప్రోత్సహించడం.



వాతావరణ మార్పు, కాలుష్యం , పర్యావరణ వ్యవస్థపై దాని ప్రభావం గురించి మాట్లాడటం మరియు మన ప్రాథమిక మానవ హక్కులుగా పరిగణించాలి
 
ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం అత్యవసరం.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) యొక్క చొరవతో చాలా కాలంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంబంధిత పౌరులు మరియు సంస్థలు సహజ పర్యావరణాన్ని కాపాడే దిశగా కృషి చేయడం లో భాగంగా రసాయనాలు భూమిలో మరియు నీటిలో చేరకుండా చూడడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించడం, విరివిగా చెట్లను పెంచడం ద్వారా ప్రపంచాన్ని జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చడానికి అనేక సంస్ధలు కలిసి పనిచేస్తున్నాయి.



మనం వీలయినన్ని మొక్కలను ఇంట్లో నైనా పెంచుదాం

నీడనివ్వడంలో చెట్లనుమించిన చల్లదనం మరెక్కడా దొరకదు.

టెంట్లు, రేకుల షెడ్లు, గుడారాలు ఇంకా ఏవైనా చెట్లనీడలా ఎండనుండి మనిషిని కాపాడలేవని మనకు తెలుసు. లక్షల రూపాయలతో కొన్న కార్లు లోపల ఎసి ఉన్నా కార్లు నిలపడానికి చెట్లనీడను వెతుక్కుటుంన్న వైనం మనం ఎక్కడ చూసినా కనిపించే దృష్యం

చెట్లు నాటని వారికి నీడను ఆస్వాదించే, వాడుకునే హక్కు నైతికంగా లేనట్టే

సమాచారం సేకరించబడినది. ఇది నాచే వ్రాయబడినది. వెంకట్