జగన్నాథ రథ చక్రాలు
అధ్బుతమైన ఆశ్చర్యకర ఆధ్యాత్మిక విషయాలు
శ్రీ_కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన_సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా ఐదుమూలకాలలో కలిపారు. కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది.
ఆయన గుండె ఈనాటి వరకూ సురక్షితంగా ఉంది. ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది. అలా కొట్టుకుంటూనే ఉంది.
పూరీజగన్నాథ్ (శ్రీ_కృష్ణుడి) ని కలియుగ ప్రభువు అని కూడా అంటారు.
ప్రతి 12సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు_విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరి_నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్ పిఎఫ్. సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ_ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది.
ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు.
ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళు కట్టుకుంటారు... పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి.. పాత విగ్రహం నుండి బ్రహ్మ_పదార్ధం" తీసి కొత్త_విగ్రహంలోకి మార్చుతారు... ఈ బ్రహ్మ_పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ... ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు. .. వేలాది_సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నది.
సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు...
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నిక గన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని బంధించేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.
ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలూ వున్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం. అవేంటో ఒకసారి మీరే చదవండి ...
మొదటిది...: తనంతట తానే ఆగిపోయే రథం..
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం వుండదు.
రెండవది...: నీడ కనిపించని గోపురం..
జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు. సూర్యుడు వచ్చినా నీడ పడదు .
ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.
మూడవది...: గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా...
ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురుతుంటుంది. కానీ పూరీ ఆలయ గోపురం పైన వుండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .
నాలుగవది...: మనవైపే చూసే చక్రం...
పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు వుంటుంది .
ఐదవది...: ఈ ఆలయంపై ఎగరని పక్షులు...
ఇది మరో వింత. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.
ఆరవది...: ఆలయంలోకి వినిపించని అలల సవ్వడి...
ఇదో విచిత్రం. సముద్ర తీరాన కొలువుతీరిన
ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్రపు హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.
0 Comments