సుదర్శన క్రియ అనే లయబద్ధమైన శ్వాస సాధన ను అందుబాటులోకి తీసుకురావడం ....
శ్వాసక్రియను అదుపులోకి తేవటం ద్వారా మానవుని భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి, భావావేశాన్ని అదుపుచేసి, తద్వారా సామాజిక ప్రశాంతతకు ఇది తోడ్పడుతుంది.
భారత ఆధ్యాత్మిక గురువు, మానవతా నాయకుడు, మరియు శాంతి రాయబారి,ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకుడు "శ్రీ శ్రీ రవి శంకర్" గారి జన్మదినోత్సవం సందర్భంగా
మానవత్వం పరిమళించిన.. శ్రీ శ్రీ రవిశంకర్ గురువు,
ఈ భూమిపై ఎంతో మంది పుడుతుంటారు.. గిట్టుతుంటారు.. కానీ కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి పోతుంటారు. ఇక ఆధ్యాత్మిక, మానవసేవా రంగాలలో విశ్వవ్యాప్తంగా కొనియాడబడుతున్న గురువు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్. నేడు సర్వత్రా లోపిస్తున్న మానవతావిలువలను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా హింస, మానసికఒత్తిడి లేని సమాజాన్ని సృష్టించాలన్న శ్రీశ్రీ దృక్పథం ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని ఆకర్షించి, ప్రపంచ అభ్యున్నతికి పనిచేసే దిశగా వారి బాధ్యతను మరింత పెంచింది.
బాల్యం నుండే లోతైన ధ్యానం, ఆధ్యాత్మిక చింతన. నాలుగేళ్ళ వయసులోనే భగవద్గీత పూర్తిగా పఠించి ఉపాధ్యాయులను ఆశ్చర్య చకితులను చేశారు. మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడైన పండిట్ సుధాకర్ చతుర్వేది వద్ద మొదటి పాఠాలు.
17 సంవత్సరాల నాటికి వేదసాహిత్యం సమగ్ర అధ్యయనం, దానితోబాటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న మహా జ్ఞాని.
1981వ సంవత్సరంలో శ్రీశ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు. ఇది విద్య, మానవసేవా రంగాలలో 152కు దేశాలలో పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ప్రత్యేక సలహా, సంప్రదింపుల సంస్థగా గుర్తింపబడింది. వ్యక్తులలో, సమాజంలో, దేశాలమధ్యా తలెత్తే సంఘర్షణల నివారణకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనటం, వాటిని ఆచరింప జేయటం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. శ్వాసక్రియను అదుపులోకి తేవటం ద్వారా మానవుని భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి, భావావేశాన్ని అదుపుచేసి, తద్వారా సామాజిక ప్రశాంతతకు ఇది తోడ్పడుతుంది.
శ్రీశ్రీ రవిశంకర్ ను అనేక అవార్డులు వరించాయి. వాటిలో చెప్పుకోదగ్గవి ఆర్డర్ ఆఫ్ పోల్ స్టార్ (మంగోలియా దేశపు అత్యున్నత అవార్డు), రష్యా ప్రభుత్వంచే ది పీటర్ ది గ్రేట్ అవార్డ్, సంత్ శ్రీ ధ్యానేశ్వర్ ప్రపంచ శాంతి బహుమతి (భారతదేశం), గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ (అమెరికా) మొదలైనవి. ఐక్యరాజ్యసమితిచే 2000వ సంవత్సరంలో జరుపబడిన మిలీనియం ప్రపంచ శాంతి శిఖరాగ్రసభ, 2001, 2003 సంవత్సరాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలలోనూ, అనేక దేశాల పార్లమెంటుసభలలోనూ శ్రీశ్రీ ప్రసంగించారు. భారతదేశప్రజలను ఆథ్యాత్మికంగా సమైక్యం చేయగలిగిన వ్యక్తి శ్రీశ్రీ తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
రవిశంకర్ మే 13, 1956 లో తమిళనాడులోని పాపనాసంలో విశాలాక్షి రత్నం, ఆర్ఎస్ వెంకట రత్నం దంపతులకు జన్మించాడు. అతను భానుమతి నరసింహన్‌కు సోదరుడు. అతను పుట్టినది ఆదివారం కావడంతో "రవి" అని, ఎనిమిదవ శతాబ్దపు హిందూ గురువు అయిన ఆది శంకరుడి పేరు మీదుగా"శంకర్", అనీ పెట్టారు. రవి శంకర్ పుట్టినది ఆదిశంకరుని పుట్టిన రోజునే.
గురూజీ అనీ, గురుదేవ్ అనీ పిలుస్తారు. అతను 1981 లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. అది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ. 1997 లో అతను జెనీవాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇది సహాయక చర్యలు, గ్రామీణాభివృద్ధిలో నిమగ్నమై ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రధాన శాఖ బెంగుళూరు సమీపంలోని జక్కూరు వద్ద ఉంది. వీరు కనుగొన్న సుదర్శన క్రియ బహు ప్రసిద్దం.
1982 లో కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాలోని భద్రా నది ఒడ్డున పది రోజుల నిశ్శబ్దం తరువాత, తన సుదర్శన క్రియ అనే లయబద్ధమైన శ్వాస సాధన తనకు చేకూరిందని చెప్పాడు. అది "ఒక పద్యం లాగా, ఒక ప్రేరణగా" తనకు వచ్చిందని చెప్పాడు. "నేను దానిని నేర్చుకున్నాను, నేర్పించడం ప్రారంభించాను" అని అన్నాడు.
1983 లో, స్విట్జర్లాండ్‌లో శంకర్ తన మొట్టమొదటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సును నిర్వహించాడు. 1986 లో, ఉత్తర అమెరికాలో మొట్ట మొదటి కోర్సు కోసం అతను అమెరికాలోని కాలిఫోర్నియాలోని యాపిల్ వ్యాలీకి వెళ్ళాడు.
నేడు సర్వత్రా లోపిస్తున్న మానవతావిలువలను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా హింస, మానసికఒత్తిడి లేని సమాజాన్ని సృష్టించాలన్న శ్రీశ్రీ దృక్పథం ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని ఆకర్షించి, ప్రపంచ అభ్యున్నతికి పనిచేసే దిశగా వారి బాధ్యతను మరింత పెంచింది.
సంఘర్షణల నివారణ, ప్రకృతిఉత్పాతాలలో ప్రజలకు అండగానిలవటం, పేదరికాన్ని నిర్మూలించటం, మహిళా స్వయంసమృద్ధి, ఖైదీలలో మానసికపరివర్తన, పునరావాసం, అందరికీ విద్య; లింగవివక్ష, భ్రూణహత్య, బాలకార్మికవ్యవస్థ లకు వ్యతిరేకంగా ప్రచారం - ఇలా బహుముఖంగా విస్తరించిన కార్యక్రమాలకు సూత్రధారి, సిసలైన సామాజికకార్యకర్త శ్రీశ్రీ. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు తలెత్తిన అనేక ప్రాంతాలలో వీరు శాంతిచర్చలలో పాల్గొన్నారు. శ్రీలంక, ఇరాక్, ఐవరీకోస్ట్, కామెరూన్, మనదేశంలోని కాశ్మీర్, బీహార్ ప్రాంతాలలో, విద్వేషాలకు లోనైన ఉభయ పక్షాలనూ శాంతిచర్చలకు ఒప్పించి, ఒక చోటకు చేర్చటంలో వీరి పాత్ర పలువురి ప్రశంసలను చూరగొంది.
శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించి 500 సంవత్సరాలైన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలలో రిసెప్షన్ కమిటీ చైర్మన్ గా శ్రీశ్రీ నియమితు లయ్యారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నియమించిన అమర్.నాథ్ దేవస్థానం బోర్డులోనూ శ్రీశ్రీ సభ్యులుగా ఉన్నారు.
ప్రతీయేటా సుమారు నలభైదేశాలు చుట్టివచ్చే శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవ్యాప్తజ్ఞానానికి ప్రతీక. విశ్వానికి వారిచ్చే సందేశం సార్వజనీనం, సుస్పష్టం: ప్రేమ, జ్ఞానం అనేవి విశ్వవ్యాప్తమైనవి. ద్వేషం, అశాంతి తాత్కాలికం మాత్రమే.
గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్:
ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సిటీ... నార్త్ ఈస్టరన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పిరిచ్యువాలిటీ, డైలాంగ్ అండ్ సర్వీస్ నుంచి భారత ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత, మానవతావాది శ్రీశ్రీ రవిశంకర్కి గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్‌గా గుర్తింపు లభించింది. ప్రపంచంలో మానవతా విలువలు పెంపోందించేందుకు చేసిన కృషికి గానూ ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. గ్లోబల్ సిటిజన్ షిప్ అంబాసిడర్‌గా రవిశంకర్‌ను సత్కరించినట్టు వర్సీటీ తెలిపింది.
సోర్స్ ఇంటర్ నెట్ ...venkat...
0 Comments